9th Annual Celebration

04.08.24 05:51 PM Comment(s) By Tirupati

Ramakrishna Mission Ashrama's Annual Celebration 04-08-2024

ఘనం గా  శ్రీ రామకృష్ణ  ఆశ్రమ వార్షికోత్సవం 

తిరుపతి, ఆగస్టు 4:

తిరుపతిలోని శ్రీ రామకృష్ణ ఆశ్రమం తొమ్మిదవ వార్షికోత్సవం ఆగస్టు 4వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా స్థానిక వినాయక నగర్ లోని ఆశ్రమం ఆవరణలో జరిగిన భక్త సమ్మేళనం లో స్వామి శశికాంతానంద (రాజమహేంద్రవరం ఆశ్రమం) మాట్లాడుతూ…
ఉత్తమ శిష్యుడు మోక్ష మార్గం పొందుతాడు. భగవంతుడు ఇచ్చని పని పూర్తి చేసేవాడు ఆదర్శ భక్తుడవుతాడన్నారు. శాస్త్రం లో పేర్కొన్న మాదిరి గురువు చెప్పినవి ఆచరించేవారు ఉత్తమ భక్తుడు.

ఈ లోకమంతా బ్రాహ్మమయం అనే భావనతో అద్వైత మార్గంలో జీవించాలన్నారు. లౌకిక కోరికలు వదులుకుని భగవంతుని ప్రార్ధిస్తూ ఉండాలి. అపుడే ఆధ్యాత్మిక సాధనలో బతుకు సార్థకమౌతుంది అన్నారు. అనంతరం  స్వామి సుకృతానంద (తిరుపతి రామకృష్ణ ఆశ్రమ, కార్యదర్శి), స్వామి సన్నివాసానందజీ (కడప రామకృష్ణ ఆశ్రమం)

స్వామి సత్వస్థానందాజీ (తిరుపతి రామకృష్ణ ఆశ్రమం), ఆచార్య పీవీ రెడ్డి, పి భాస్కరరావు (రాణి పేట, తమిళనాడు) వివిధ ఆధ్యాత్మిక విషయాలపై ప్రసంగించారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు ధ్యానము తర్వాత విష్ణు సహస్రనామ పారాయణము నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాస్టర్ గోపి బృందం చే భజనలు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆరాత్రికం, భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి సత్వస్థానంద, జయచంద్ర రెడ్డి, జియస్ ప్రసాద్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PHOTO GALLERY

Tirupati

Share -